Sunday 20 October 2013

'బంగారు' రాజు కథ



నెత్తురు అంటిన నిధి చరిత
తెల్లదొరలపై ఎత్తిన తిరుగుబాటు పతాక
కాన్పూర్‌లో సిపాయిల విజయోత్సాహం
బ్రిటిష్ కుటుంబాల ఊచకోత
ఇది కాన్పూర్ రాజు రామ్‌బక్ష్ పనేనని అనుమానించిన అధికారులు
పట్టుకొని ఉరితీత
సంపన్న స్వదేశీ రాజుల్లో రామ్‌బక్ష్ ఒకరు
చనిపోవడానికి ముందు కోటలో సంపద దాచిన ట్టు ప్రచారం
నిధి కోసం గతంలోనే వారసుల ప్రయత్నం


Friday 19 April 2013

నేను తిరిగిన దారులు

కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు నేను రాసిందే మళ్ళీ చదువుతున్నానేమో అనిపించింది. కొన్ని అనుభవాలని చదువుతున్నప్పుడు అవన్నీ నాక్కలిగినవే అని పదే పదే గుర్తొచ్చింది. 'ఇంకా ఏమేం రాసి ఉండొచ్చు?' అన్న ఆసక్తి, ఆసాంతమూ పుస్తకాన్ని వదలకుండా చదివేలా చేసింది. పుస్తకం పేరు 'నేను తిరిగిన దారులు.' నదీనదాలూ, అడవులు, కొండలు అనేది ఉప శీర్షిక. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు. ఇది ఒక యాత్రా చరిత్ర.

కవి, రచయిత, సాహితీ విమర్శకుడిగా పేరున్న చినవీరభద్రుడు ఓ నిరంతర ప్రయాణికుడు కూడా. ప్రదేశాలని చూడడం కన్నా, ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడే ప్రయాణికుడు. ("కారు అద్దం నుంచి ప్రదేశాలని మాత్రమే చూడగలం, ప్రపంచాన్ని కాదు" అంటుందిజానకి..) ఈ కారణం వల్లనే కావొచ్చు, బాగా తెలిసిన ప్రదేశాలని సైతం అతని కళ్ళతో చూసినప్పుడు ఓ కొత్త ప్రపంచం కనిపించింది.. వెంటాడింది... వెంటాడుతూనే ఉంది...

శిల్పకళా శోభితం - డా. సంగనభట్ల నరసయ్య


రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో హావభావాలు పలికించడం... కర్ణాటక రాష్ట్రంలో రామప్ప గుడికి సమ ఉజ్జీలైన హోయసల శిల్పారామాలు, హళేబీడు, బేళూరు దేవాలయాలు చుట్టూ అందమైన పూల తోటలతో, మంచినీటి సౌకర్యాలతో, పర్యాటక శాఖ వారి ప్రజా సౌకర్యాలతో, రాజమార్గాలతో అలరారుతున్నాయి. రామప్ప గుడి మాత్రం ఏ సౌకర్యమూ లేక ఉంది. దీన్ని అందమైన పర్యాటక స్థలంగా మార్చవచ్చు. 

కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?! - డాక్టర్ వేంపల్లి గంగాధర్


కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం.

పోగొట్టుకున్నాం!

ఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం...